నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు సర్కారు బడుల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో విద్యార్థులకు బెల్లం, రాగి జావా కలిపిన బ్రేక్ ఫాస్ట్ అందజేస్తారు.
దీంతోపాటు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తృణధాన్యాలను మధ్యాహ్న భోజనంలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. బెల్లం పౌడర్, రాగి పిండిని బడులకు అందజేయనుండగా, మధ్యాహ్న భోజన పథకం కుక్ కమ్ హెల్పర్లు రాగి జావాను తయారుచేసి విద్యార్థులకు అందజేస్తారు. మధ్యాహ్న భోజన పథకం మెనూలో వినూత్నంగా వారంలో ఒకరోజు వెజిటేబుల్ బిర్యానీని అమలు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 May,2023 08:10AM