నవతెలంగాణ-హైదరాబాద్ : మెట్రో రైళ్లల్లో విద్యార్థులకు పాస్‌లు ఇచ్చేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ నిర్ణయించింది. బస్సులు, రైళ్లల్లోని నెలవారీ పాస్‌ల విధానంలో మెట్రో పాస్‌లు జారీ చేయనున్నట్టు పేర్కొంది. చెన్నై మెట్రో రైళ్లలో ప్రస్తుతం రోజుకు సగటున 2 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఇక, ప్రయాణికుల సౌలభ్యం కోసం చెన్నై మెట్రో రైల్ ఇప్పటికే పలు రాయితీలను అందిస్తోంది. రోజంతా ప్రయాణించేందుకు రూ.100 టిక్కెట్టు, నెలంతా ప్రయాణించేవారి కోసం రూ. 2500కు పాస్, బృందంగా ప్రయాణించే వారికి ఛార్జీల తగ్గింపు వంటి పలు రాయితీలను ప్రకటించింది. అయితే, తమకు అనుకూలంగా ఉండే పాస్‌లు జారీ చేయాలని కళాశాల విద్యార్థులు కొంత కాలంగా కోరుతున్నారు. ఈ క్రమంలో సంస్థ సర్వే చేపట్టగా మెట్రో ప్రయాణికుల్లో విద్యార్థుల వాటా 40 శాతం ఉన్నట్టు తేలింది. 47 శాతం మంది ఉద్యోగులు, మిగతా 13 శాతం మంది ప్రయాణికులు ఉన్నట్టు తేలింది. దీంతో, విద్యార్థుల సౌకర్యార్థం రాయితీ ధరలకు స్టూడెంట్ పాస్ అందుబాటులోకి తీసుకురావడానికి చెన్నై మెట్రో రైల్ నిర్ణయించింది.
Mon Jan 19, 2015 06:51 pm