- రేపు భూమిపూజ చేయనున్న కేటీఆర్
నవతెలంగాణ హైదరాబాద్: రంగారెడ్డిలో తైవాన్‌కు చెందిన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ కంపెనీ ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో కలిసి కంపెనీ నిర్మాణానికి రేపు ఉదయం పదిన్నర గంటలకు భూమిపూజ చేయనున్నారు. రూ.1,656 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ గ్రామంలో ఫాక్స్‌కాన్ కంపెనీ నిర్మాణం చేపడుతున్నారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
ఈ కంపెనీ నిర్మాణం పూర్తయితే సుమారు 35 వేల మందికిపైగా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తెలంగాణలో కంపెనీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే ఫాక్స్‌కాన్ సంస్థ అందుకు అంగీకరించింది. దాంతో రాష్ట్ర సర్కారు కంపెనీ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్ సంస్థకు 196 ఎకరాల భూమిని కేటాయించింది.
కలెక్టర్ కార్యాలయంలో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. రేపటి భూమిపూజకు సంబంధించిన విషయాలపై వారితో చర్చించారు. కంపెనీ ప్రాంగణంలో నిర్మించబోయే రోడ్లు, ఇతర భవనాల మ్యాప్‌లను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీస్ గ్రూప్ ఛైర్మన్ యంగ్ ల్యూ తోపాటు మంత్రి సబితా రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్. సుమారు 70శాతం యాపిల్ ఐఫోన్లు ఫాక్స్‌కాన్ కంపెనీయే తయారు చేస్తుండడం గమనార్హం. యాపిల్ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్‌కాన్‌కు భారీ ఆర్డర్ రావడంతో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 May,2023 07:58PM