భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ మండలం పాత పాల్వంచలో విషాద సంఘటన చోటు చేసుకుంది. శివ అనే ఫోటోగ్రాఫర్ అనుమాన స్పద స్థితిలో మృతి చెందాడు. ఇది హత్య అని అతని బంధు మిత్రులు ఆరోపించారు. శివ ఇంటికి వెళుతుండగా కొందరు అతనిపై దాడిచేసి కొట్టారని మృతుడి బంధువులు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm