హైదరాబాద్: డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ రాజస్థాన్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ లోని డేరా బాబా స్వగ్రామమైన గురుసర్మోడియాలో ఆమె ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆ గ్రామంలోకి భారీ ఎత్తున పోలీసులు వెళ్లారు. హనీ కోసం సోదాలు నిర్వహిస్తున్నారు. ఓ పాఠశాలలో ఆమె ఉందన్న సమాచారంతో అక్కడ కూడా సోదాలు జరుపుతున్నారు. మరోవైపు, ఆమె నేపాల్ కు పారిపోయినట్టు అందరూ భావించిన సంగతి తెలిసిందే. హనీ ప్రీత్ దొరికితే డేరాలోని అరాచకాలపై పూర్తి సమాచారం దొరుకుతుందని పోలీసులు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm