హైదరాబాద్: ఓ మహిళ పట్ల తోటి మహిళలు అమానవీయంగా ప్రవర్తించారు. ఆమెను రోడ్డుకీడ్చి బట్టలు చించేశారు. వివస్త్రను చేశారు. అదే పనిగా కత్తెరను వెంట తెచ్చుకుని జుట్టు కత్తిరించారు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. గ్వాంగ్ఝౌ ప్రావిన్స్‌లోని ఓ పట్టణంలో నడిరోడ్డు మీద కనిపించిన దారుణ కృత్యం ఇది. ఓ వ్యక్తితో బాధిత మహిళ సహజీవనం చేస్తుండటమే కారణం. ఆమెపై దాడి చేసిన ముగ్గురు మహిళలు.. ఆ వ్యక్తి భార్య, అత్త, సోదరి. చిన్యాంగ్ అనే వ్యక్తి కొద్దిరోజులుగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అతనికి ఇదివరకే పెళ్లయింది. అయినప్పటికీ.. తనకు పరిచయమైన ఓ మహిళతో స్నేహం పెంచుకున్నాడు. ఆమెతో సహజీవనం చేయడం మొదలు పెట్టాడు. దీనితో తన ఇంటికి వెళ్లడం కూడా మానేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య.. ఆ వ్యక్తిని చాలాసార్లు మందలించింది. అయినప్పటికీ- అతను వినిపించుకోలేదు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ భార్య.. తన భర్తను కూడా దండించాల్సింది పోయి.. బాధిత మహిళపై కసి పెంచుకుంది. తన తల్లి, సోదరితో కలిసి బాధిత మహిళపై దాడి చేసింది. తీవ్రంగా కొట్టింది. నడిరోడ్డు మీద వివస్త్రను చేసింది. జుట్టు కత్తిరించింది. ముఖంపై కాలు పెట్టి నిల్చోగా.. మరో మహిళ ఆమెను కొట్టడం, బట్టలను విప్పదీయడం వంటి దృశ్యాలను ఆమె సమీప బంధువు వీడియో తీశాడు. దీనిపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది.
Mon Jan 19, 2015 06:51 pm