హైదరాబాద్: ప్రాణాలతో పోరాడుతున్న ఓ చిన్నారిని సకాలంలో ఆస్పత్రికి చేర్చి హీరో అయ్యాడు ఓ అంబులెన్స్ డ్రైవర్. చిన్నారి ఉన్న ప్రాంతం నుంచి ఆ ఆస్పత్రికి వెళ్లాలంటే దాదాపు 13గంటలు సమయం పడుతుంది. అయితే 7గంటల్లోనే ఆ బిడ్డను ఆస్పత్రికి తరలించి ఆమె ప్రాణాలను కాపాడాడు. కేరళకు చెందిన ఫాతిమా లబియాకు అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. కన్నూర్ ఆసుపత్రి నుంచి ఆమెను తిరువనంతపురంలోని శ్రీచిత్ర మిషన్ హాస్పిటల్‌కు తరలించాల్సి ఉంది. ఎయిర్ అంబులెన్స్ వచ్చి పాపను తీసుకెళ్లేంత సమయం లేదు. కన్నూర్ ఆసుపత్రి నుంచి విమానాశ్రయానికి చేరుకోవాలంటే మూడు గంటల ప్రయాణం.. ఎయిర్ అంబులెన్స్‌ను సిద్ధం చేసేందుకు మరో ఐదు గంటల సమయం పడుతుంది. దీంతో పాప పరిస్థితి విషమించక ముందే రోడ్డు మార్గంలో తిరువనంతపురం చేర్చాలని అనుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్ తమిమ్ వెంటనే చిన్నారిని తీసుకుని ఆస్పత్రికి పయనమయ్యాడు. కన్నూర్ నుంచి తిరువనంతపురానికి 516 కి.మీ దూరం. ప్రయాణ సమయం దాదాపు 13గంటలు. అయితే.. తమిమ్ మాత్రం గూగుల్ మ్యాప్ సహాయం ద్వారా ట్రాఫిక్ లేని ప్రదేశాల్లో అంబులెన్స్ తీసుకెళ్తూ కేవలం ఏడు గంటల్లోనే తిరువనంతపురం ఆసుపత్రికి చిన్నారిని చేర్చాడు.
కేరళ పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అంబులెన్స్ వెళ్లేందుకు రహదారి మీద ఎటువంటి అడ్డంకులు లేకుండా చేశారు. అంబులెన్స్‌కు రక్షణగా పోలీస్‌కు చెందిన రెండు ఎస్‌యూవీలు, మరొక అంబులెన్స్‌ను పంపించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడా.. వేగం తగ్గకుండా తమిమ్ చాలా జాగ్రత్తగా అంబులెన్స్ నడుపుకొంటూ తిరువనంతపురం చేర్చి చిన్నారి ప్రాణాలను నిలబెట్టాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 17,2017 07:22PM