హైదరాబాద్: ఎమ్మెల్సీ స్టిక్కర్ అతికించిన వాహనంలో తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తున్న ఎమ్మెల్సీ కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ఎమ్మెల్సీ డ్రైవర్ నరేష్... గత కొన్ని రోజులుగా అశోక్‌నగర్‌లో ఓ మహిళా జూనియర్ కళాశాల వద్ద విద్యార్థినులను వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఎమ్మెల్సీ వాహనంలో కళాశాల చుట్టూ తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తున్నట్టు ఫిర్యాదులు అందడంతో.. పోలీసులు కాపుకాచి ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm