కర్ణాటక : సారీ అప్పు.. అయామ్ సో సారీ.. నేను ఎవ్వరినీ హర్ట్ చేయాలని అనుకోలేదు.. నేను హర్ట్ చేయను కూడా.. అంటూ బాయ్ ఫ్రెండ్ కు వీడియో పంపింది. అందులో ఆమె నిద్రమాత్రలు మింగుతూ కనిపించింది. ఇంతకూ ఆమె అలా ఆత్మహత్య చేసుకోవాలని అనుకోడానికి కారణం ఏమిటో తెలుసా..? బాయ్ ఫ్రెండ్ అప్పు అనే అతడు ఆమెతో మాట్లాడలేదట. అప్పు అనే యువకుడు ఈ యువతి గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఏమి జరిగిందో ఏమో గత కొద్ది రోజులుగా మాటలు లేవు. దీంతో ఆ యువతి తెగ బాధపడిపోయింది. దీంతో తాను చనిపోతున్నానని 10 కి పైగా ట్యాబ్లెట్లు మింగి అప్పు కి వీడియో వాట్సప్ లో పంపింది. ఆ వీడియో చూసిన అప్పు వెంటనే ఆ యువతి ఉన్న హాస్టల్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే వారు స్పందించి ఆ యువతిని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఆ యువతికి ఎటువంటి ప్రాణహాని కూడా లేదని వైద్యులు తెలిపారు. ప్రాణాలంటే లెక్కలేకుండా పోతున్నాయన్నదానికి ఇదో ఉదాహరణ. బాయ్ ఫ్రెండ్ మాట్లాడకపోతే కూడా ప్రాణాలు తీసుకోవాలని అనుకోవడం మూర్ఖత్వం. కర్ణాటక రాష్ట్రం తుముకూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm