హైదరాబాద్: స్కూల్ నుంచి ఇంటికొచ్చే ఉత్సాహంలో ఉన్నారు ఆ విద్యార్థులు. బస్సు దిగగానే చెరోవైపు పరిగెత్తారు. ఓ ఇద్దరు విద్యార్థులు మాత్రం అటూ ఇటూ చూడకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నించారు. అంతలో అటుగా వస్తున్న వాహనాన్ని వారు గమనించలేదు. వారిని చూసిన ట్రక్కు డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడంతో ఆ చిన్నారి ప్రాణాలు నిలిచాయి. రెప్పపాటు ఆలస్యమైనా, ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ ఘటన నార్వేలో జరిగింది. స్కూల్ నుంచి పిల్లలు రావడం.. వారు రోడ్డు దాటుతూ పరిగెత్తడం అంతా వెనక ఉన్న మరో వాహనం సీసీ కెమెరాలో రికార్డయ్యింది. జూన్లో ఈ ఘటన జరిగింది. కాగా.. ఇటీవలే ఈ వీడియోను విడుదల చేశారు. రోడ్డు దాటేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్పేందుకు ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు ట్రక్ యజమాని తెలిపారు.ఆ వీడియోను మీరూ చూసేయండి..
Mon Jan 19, 2015 06:51 pm