హిమాచల్ ప్రదేశ్ : హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్లో గత కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తున్న విషయం తెలిసిందే. మర్హి, కోక్సార్ ప్రాంతాల్లో రోడ్లన్నీ మంచుతో కప్పేయబడ్డాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలికి వెళ్లే మనాలి-లేహ్ రహదారిపై మంచు కుప్పలుగా పేరుకుపోయింది. రహదారుల నిర్వహణా విభాగం అధికారులు భారీగా ఏర్పడిన మంచును జేసీబీలతో తొలగిస్తున్నారు. మంచుతో ఆయా ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
Mon Jan 19, 2015 06:51 pm