హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి, హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్పై సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్వలింగ సంపర్కులు అంటూ నీచమైన కామెంట్ చేయడంపై రాంగోపాల్ వర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు. రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ ఫొటోపై రాంగోపాల్ వర్మ తన తొలి పోస్టులో ఈ విధంగా కామెంట్ చేశారు. నాకు మహిళలంటే అమితమైన గౌరవం ఉంది. వారిని బాగా ఆరాధిస్తాను. ఇలా స్వలింగ సంపర్కుల సంస్కృతి (గే కల్చర్)ని బాహాటంగా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఫేస్బుక్లో వర్మ పోస్ట్ చేశాడు.
నేను బాలాజీని చెబుతున్నాను.. ఈ భూమ్మీద నీకు టైమ్ దగ్గర పడింది ఆర్జీవీ. నువ్వు చనిపోబోతున్నావుః అంటూ ఓ అభిమాని తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, రాంగోపాల్ వర్మ పరస్పరం ముద్దాడుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసి 'గే కల్చర్ అది కాదు.. ఇది. మీ హ్యాండ్ అన్నింట్లోనూ ఉంటుంది' అంటూ కామెంట్ చేశాడు. వాళ్ల ఫ్యాన్స్.. వీళ్ల ఫ్యాన్స్ అని లేకుండా.. అందరి హీరోల అభిమానులు ఈ విషయంలో వర్మపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 20,2017 04:15PM