లండన్ : కాఫీతో కూడా బస్సులు నడుస్తున్నాయి.. ఇదేదో పొరపాటున రాశారనుకోకండి. మీరు చదివింది అక్షరాల నిజమే. లండన్‌లో కాఫీ ఆధారంగానే బస్సులు తిరిగేస్తున్నాయటమరి. జీవ ఇంధనం(బయో ఫ్యూయల్) తయారీలో కాఫీ గింజల వ్యర్థాలనూ(వేస్టేజ్) వినియోగిస్తుండగా, తొలిసారిగా ఇలా వచ్చిన ఇంధనంతో సోమవారం ఇక్కడి కొన్ని బస్సులు పరుగులు తీశాయని బీబీసీ తెలియజేసింది. ఈ కాఫీ ఆయిల్‌ను టెక్నాలజీ సంస్థ బయో-బీన్ ఉత్పత్తి చేస్తున్నది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను నియంత్రించడంలో భాగంగా లండన్ రవాణా శాఖ.. జీవ ఇంధన వినియోగాన్ని క్రమేణా పెంచుతున్నది. ఇప్పటికే వంట నూనెలు, మాంసం తయారీలో వస్తున్న వ్యర్థాల ద్వారా తయారుచేస్తున్న బయో ఫ్యూయల్‌తో లండన్ నగరంలో 9,500 బస్సులు నడుస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm