శంషాబాద్ కు ఇవాంకా ఎన్నింటికి రానున్నారు? ఏఏ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు? వంటి వివరాలన్నీ రహస్యమే ఆమెను ఆహ్వానించేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎవరూ రావద్దన్న భద్రతాధికారులు
ఇవాంకా పర్యటనుకు సంబంధించిన ఏ చిన్న అంశమూ బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతున్న భద్రతాధికారులు
గ్లోబల్ సమ్మిట్ సదస్సుకు హైదరాబాదుకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సలహాదారు ఇవాంకా ట్రంప్ పర్యటనను అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. ఆమె అధికారిక పర్యటనకు సంబంధించిన ఏ వివరాలు బయటకు పొక్కనీయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా శంషాబాదు విమానాశ్రయంలో ఆమె అడుగుపెట్టే సమయంలో అధికారిక హోదాలో ఆమెను ఆహ్వానించేందుకు ఎవరూ రావద్దని అమెరికా భద్రతాధికారులు సమాచారం అందించారు. దీంతో ఆమె ఎన్నిగంటలకు హైదరాబాదులో ల్యాండ్ అవుతారు? ఎక్కడ బసచేస్తారు? ఏఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు వంటి వివరాలన్నీ రహస్యంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ సదస్సు చివర్లో ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమాలు పూర్తైన అనంతరం...హైదరాబాద్ కు చెంది కెనడాలో స్థిరపడ్డ ప్రముఖ వ్యాపార వేత్త ప్రేమ్ శ్రీవాస్తవ, అమెరికాకు చెందిన సిస్కో కంపెనీ యజమాని జాన్ చాంబర్స్ తోపాటు పది మంది పెట్టుబడిదారులతో సమావేశం కానున్నారని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 21,2017 08:22AM