హైదరాబాద్: బాలీవుడ్ నటి గీతా బస్రాను టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక పాప పుట్టింది. తాగాజా తన భార్య, కుమార్తెతలో కలసి స్వర్ణ దేవాలయం వద్ద దిగిన ఫొటోను భజ్జీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోపై భారత మాజీ కెప్టెన్ స్పందించాడు. ఃబాబు చాలా అందంగా ఉన్నాడు. ఎంతో ప్రేమను పంచాలిః అంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పాడు. 'క్షమించాలి... పాప చాలా అందంగా ఉంది... వయసు పెరుగుతోంది భజ్జీ' అంటూ మరో ట్వీట్ చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm