మరికాసేపట్లో ఓ గృహిణి అవుతున్నానన్న ఆ పెళ్లికూతురి ఆశలపై నీళ్లు చల్లాడు వరుడు. ఓ వైపు పెళ్లి కోసం సర్వం సిద్ధం అయిపోతే మరోవైపు వరుడు గొంతమ్మ కోరికలు కోరడంతో కలకలం చెలరేగింది. కట్నం తీసుకోవడమే తప్పయితే, పెద్దలు మాట్లాడుకున్న కట్నానికి బదులు అదనపు కట్నం అడిగి ఆ యువకుడు మరో తప్పు చేశాడు. ఆ యువకుడి తీరుతో వివాహం రద్దయింది. దీంతో కలత చెందిన పెళ్లి కూతురు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పచ్చల నదుకుడలో చోటు చేసుకుంది. ఆమెను ఆర్మూర్‌లోని ఎంజె ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm