హైదరాబాద్ : కత్తి మహేష్ - పవన్ అభిమానుల మధ్య గోడవ రోజు రోజుకు పెరుగుతూనే వస్తుంది. తాజాగా కత్తి మహేష్ మీద పవన్ అభిమానులు కోడి గుడ్లతో దాడి చేయడం కూడా జరిగింది. దీంతో గోడవ మరింత ముదిరింది. ఇక తాజాగా ఓ టీవి ఛానల్ డిబెట్లో కత్తి మహేష్‌కు సంబందించిన వాట్సాప్ మెస్సెజ్‌లు బయటకు లీక్ చేశారు. దీంతో కత్తి మహేష్ మాట్లాడుతూ.. నా గురించి ఆ విషయాలు మాట్లాడితే.... నేను పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ విషయాల గురించి కూడా మొదలు పెట్టవచ్చా? మీరు నాకు ఆ పర్మిషన్ ఇచ్చేస్తే ఆ తర్వాత ఇంకేమైనా మాట్లాడుకుందాం.... అంటూ కత్తి ఎదురు ప్రశ్నించారు. ఇక్కడ నైతికతా? సమస్యా? ఒక వ్యక్తి నైతికతను ప్రశ్నించి దాని ద్వారా ఇతడికి మాట్లాడే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు అని డిస్కస్ చేయడం ఏ రాజ్యాంగం నేర్పించింది? అని కత్తి మహేష్ మండి పడ్డారు. నాకు మీరు పర్మిషన్ ఇస్తే పవన్ కళ్యాణ్ ఎఫైర్స్ అన్నీ చెబుతాను. నేను చేసిన దానికి అతడు చేసిన అన్యాయానికి చాలా తేడా ఉంది. మాట్లాడుకుందామా? అయితే నేను రెడీ... అదే విషయం అయితే ఇక దేని గురించీ వద్దు... దాని గురించే మాట్లాడుకుందామా? అంటూ మహేష్ కత్తి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ విషయాలన్నీ చెబుతాను. ఇప్పుడున్న పెళ్లాం ఇంకా నిద్రపోతూ ఉంటే.... రాత్రి 3 గంటలకు ఎవరిని పంపడానికి తన సొంత కారు వేసుకుని పవన్ మెయిన్ రోడ్డుకు వస్తాడో మాట్లాడదాం... ఓకేనా? అంటూ కత్తి మహేష్ ప్రశ్నించారు. వీళ్లు చేస్తున్నది ఏంట్రా అంటే.. నేను ఒక ప్రశ్న వేశాను. రాజకీయ ప్రశ్న. నా విబేధాలను తెలియజెప్పాను. నా మీద దాడి జరుగుతోంది. దానికి ఎదురొడ్డి ఆత్మగౌరవంతో పోరాడుతున్నాను. దీంతో నాపై మరోలా దాడి మొదలు పెట్టారు. వీడికి క్యారెక్టర్ లేదు, వీడు తాగుబోతు, తిరుగుబోతు కాబట్టి ప్రశ్నించకూడదు అంటున్నారు. అదేనా మీ పంథా? అదే మీ పంథా అయితే అన్ని విషయాలు మాట్లాడుకుందాం? అంటూ కత్తి ఆవేశంగా సమాధానం ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ గురంచి అతడి ఎఫైర్ల గురించి మాట్లాడుకుందాం. ఎంత మంది ప్రొడ్యూసర్లను నాశనం చేశాడు, ఎంత మంది అమ్మాయిలతో ఇతడికి ఎఫైర్ ఉంది. ఎంత మంది అమ్మాయిలను త్రివిక్రమ్ అనే డైరెక్టర్ సెటిల్మెంట్ చేసి లాస్ట్ 2 ఇయర్స్ లో పంపించాడు. వీటన్నింటి గురించి మాట్లాడుదాం...ఆ తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుదాం. దీనికి మీరు సిద్ధమేనా? అంటూ కత్తి ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 19,2018 09:11PM