పెద్దపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర భారీ నీటిపారుద శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికారుల బృందంతో కలిసి శనివారం అర్ధరాత్రి పరిశీలించారు. ధర్మారం మండలం నందిమేడారం వద్దగల 6, 7 ప్యాకేజీ పనులను, కరీంనగర్ జిల్లా రామడుగులో 8వ ప్యాకేజీ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా ఏడో ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి హరీష్ ఆదేశించారు. అంతేగాక జూన్ నాటికి ఎత్తిపోతల పథకం ప్రారంభించేలా పనులు చేయాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm