కమిలిన చర్మానికి టమాటా సూపర్‌గా పనిచేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. టమాటాలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా చర్మానికి పైపూతగా కూడా ఉపయోగించవచ్చు. నిజానికి, చర్మంపై టమాటా రసం లేదా టమాటా ముక్కను రుద్దినట్లయితే కమిలిన చర్మం తగ్గిపోయి, కొద్ది రోజుల్లో కాంతివంతంగా కనిపిస్తుంది. ఇది విటమిన్ సి ఎక్కువగా కలిగి ఉండడం వల్ల మీ చర్మాన్ని కాంతి వంతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే మొటిమలకు చికిత్సగా వాడే క్రీములు, ఆయింట్మెంట్లలో సాధారణంగా వాడే విటమిన్ సి, ఏలు టమాటాలలో అధికంగా ఉంటాయి. అందువల్ల మీకు మొటిమలు ఉంటే, మీరు టమాటా రసాన్ని అప్లై చేయండి.
Mon Jan 19, 2015 06:51 pm