పెర్త్: ఆస్ట్రేలియాలో 150 తిమింగలాలు సముద్ర తీరానికి కొట్టుకువచ్చాయి. దీంతో స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పెర్త్ సమీపంలో ఉన్న హమాలిన్ బే దగ్గర తిమింగలాలు నిలిచిపోయాయి. వీటిల్లో సగం చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రాణాలతో ఉన్న తిమింగలాలను సముద్రంలోకి వదిలేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒడ్డున పడి ఉన్న వాటిని షార్ట్ ఫిన్నిడ్ పైలట్ వేల్స్‌గా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm