కొంతమందికి ఖర్జూర అంటే అస్సలు ఇష్టముండదు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిగా కూడా ఉంటుంది. ఇవి మీ రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఎనర్జీ, షుగర్, ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ మొదలయినవి అధికంగా ఉంటాయి.
బరువును తగ్గిస్తుంది: వీటిని మీ రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల కొవ్వును కంట్రోల్లో ఉంచుతుంది. బరువు పెరగకుండా చేస్తుంది. ఖర్జూరలో కొవ్వు ఉండదు. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. దీనివల్ల నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
బలంగా, చురుగ్గా ఉంచుతుంది: ఖర్జూర కండరాలను బలంగా ఉంచుతుంది. ఇందులో ఉండే బి1, బి2, బి3, బి5, ఎ1 మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
ఎముకలను బలంగా చేస్తుంది: వీటిని తరుచుగా తినడం వల్ల ఆస్టియోపోరొసిస్(ఎముకలు గుళ్ళబారే వ్యాధి)ని తగ్గిస్తుంది. మాంగనీస్, కాపర్, మెగ్నీషియమ్ ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. ఇవి ఖర్జూరలో ఎక్కువగా ఉంటాయి.
చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది: ఇవి ప్రతిరోజూ తినడం వల్ల ముఖం మీద ఉండే నల్లని మచ్చలు, ముడతలు తగ్గి ముఖం మృదువుగా తయారవుతుంది. ఖర్జూరను గోరువెచ్చని నీటిలో నానబెట్టి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
అలర్జీలను దరిచేరనీయదు: ఇందులో ఉండే ఆర్గానిక్ సల్ఫర్ సీజనల్ ఎలర్జీలు రాకుండా చేస్తుంది. ఆర్గానిక్ సల్ఫర్ ఎలర్జీలను తగ్గించడంలో ప్రతముఖ పాత్ర వహిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 23,2018 08:15PM