జయశంకర్ భూపాలపల్లి: అభంశుభం తెలియని నాలుగేండ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన జిల్లాలోని వెంకటాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. ఆ ప్రబుద్ధుడు ఎవరో కాదు.. ఆ బాలిక సొంత పెదనాన్న కొడుకు. అంటే వరుసకు అన్నయ్య. వావి వరసలు మరిచి కామంతో ఆ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక ఎస్సై నరహరి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm