ఏలూరు: హైదరాబాద్‌లో హడలెత్తించిన చెడ్డీ గ్యాంగ్ పశ్చిమగోదావరి జిల్లాలో హల్ చల్ చేసింది. ఓ ఇంట్లో దోపిడీకి విఫలయత్నం చేసింది. స్థానికులు వెంటనే స్పందించడంతో చెడ్డీ గ్యాంగ్ పరారైంది. అయితే పోలీసులు మాత్రం తీరిగ్గా స్పందించడంతో ఏలూరులో ఇప్పుడు చర్చనీయాంశమైంది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఏలూరు శాంతి నగర్ 8వ రోడ్డులోని ఓ ఇంట్లోకి ఆరుగురు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు వెళ్లేందుకు ప్రయత్నించారు. చెడ్డీలు, కట్ బనియన్లు వేసుకొని నోటికి గుడ్డలు కట్టుకొని లోపలకి ప్రవేశించారు. మెయిన్ గేట్‌ను అక్కడే ఉన్న ఓ మోటార్ బైక్‌ను ఒక తాడుతో గేటుకు కట్టేసి ఆ పక్కనే ఉన్న కారు టైర్లకు గాలి తీసేశారు. అనంతరం ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm