రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న చిత్రం ఆఫీసర్. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను ఈ నెల 28వ తేదీ రాత్రి ఏడు గంటలకు ఎన్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నట్టు ఓ ట్వీట్ లో తెలిపారు. నాగార్జున ఫ్యాన్స్ అందరికీ ఇదే నా ఆహ్వానం. దయచేసి ఈ వేడుకలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నా. ఈ చిత్రాన్ని జూన్ 1న విడుదల చేస్తున్నాం అని వర్మ చెప్పారు.
కాగా, ఈ చిత్రంలో నాగార్జున సరసన మైరా శరీన్ నటిస్తుండగా, నాగ్ కుమార్తెగా చిన్నారి కావ్య నటిస్తోంది. ఈ చిత్రంలోని నవ్వే నువ్వు.. అని సాగే పాట ఈ నెల 22న విడుదలైంది. ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్న ఈ పాటను మొత్తం 3.4 లక్షల మంది వీక్షించారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 25,2018 07:13PM