ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ నటిస్తున్న తాజా చిత్రం కేదార్నాథ్. అభిషేక్కపూర్ దర్శకుడు. కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో జరిగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. తొలి చిత్రానికి బ్రేక్ పడటంతో సారా కెరీర్‌కు ఇబ్బంది రాకూడదని భావించిన సైఫ్..సారాకు మరో సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇప్పించారు. అయితే అభిషేక్ కపూర్ ఒప్పందం ప్రకారం కేదార్నాథ్ పూర్తయే వరకు సారా మరే సినిమాలో నటించకూడదు. కానీ సారా ఒప్పందాన్ని పక్కన పెట్టి వేరే సినిమాను ఓకే చేసిందని అభిషేక్కపూర్ బాంబే హైకోర్టులో కేసు వేశాడు. తనకు రూ.5 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని అభిషేక్కపూర్ డిమాండ్ చేస్తున్నాడు.
మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుంతో చూడాలి. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సింబా చిత్రంలో రన్ వీర్ సింగ్ కు జోడీగా సారా నటించనుంది. కేదార్ నాథ్ షూటింగ్ మే నుంచి జులై 5 వరకు ఉంటుందని ముందే సారాఅలీఖాన్ కు చెప్పామని, అయితే షూటింగ్ సారా అసిస్టెంట్ కు ఫోన్ చేస్తే ఆమె వేరే సినిమా షూటింగ్ లో బిజీగా ఉందని చెప్పాడని కేదార్ నాథ్ నిర్మాత ఫిర్యాదులో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 25,2018 10:01PM