ఈస్ట్ రూథర్ఫర్డ్ : రెండో ప్రపంచ యుద్ద కాలం నాటి పరిస్థితులను కళ్లారా చూశారు. ఆయన పేరు విటో ట్రాస్. వయస్సు 92 సంవత్సరాలు. ఈ వయస్సులో డిప్లొమా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈస్ట్ రూథర్ఫర్డ్ హైస్కూల్లో చేరిన విటో ట్రాస్ ఆర్మీలో చేరాలన్న ఇష్టంతో 75ఏండ్ల కిత్రమే మధ్యలో స్కూల్ మానేశారు. ఆ తర్వాత ఆర్మీలో చేరారు. 75 ఏండ్ల తర్వాత 2018లో డిప్లొమా పూర్తి చేసిన విటో ట్రాస్కు ఈస్ట్ రూథర్ఫర్డ్ హైస్కూల్ యాజమాన్యం సర్టిఫికెట్ను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో విటో ట్రాస్ మాట్లాడుతూ.. తాను వెళ్లిపోవడానికి ఇంకా ఎంతో సమయం లేదని, ఇక గ్రాడ్యుయేట్ అవడం మంచిదని చమత్కరించాడు.
Mon Jan 19, 2015 06:51 pm