బిగ్ బాస్ సీజన్ 2 చప్పగా సాగుతోందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో షోను రసవత్తరంగా మార్చేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. గురువారం రాత్రి ఎపిసోడ్ చివర్లో చూపించిన రేపటి దృశ్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సభ్యులు ఒకరిపై ఒకరు ఆగ్రహావేశాలతో ఊగిపోతూ సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకోవడం ఆ దృశ్యాల్లో కనిపించింది.
తనీష్, నూతన్ నాయుడు, సామ్రాట్ పెద్ద స్వరంతో.. నోరు మూసుకో, చేతులకు గాజులు తొడుక్కోలేదు, రేపటి నుంచి చూసుకుందాం. వంటి పరుష పదాలతో ఒకరిని ఒకరు దూషించుకోవటం గమనార్హం. అసలు అంత తీవ్రమైన గొడవలు ఎందుకొచ్చాయి, బిగ్ బాస్ ఎటువంటి లిటిగేషన్ పెట్టారనేది ఆసక్తికరంగా మారింది. తన ఆదేశాలను సక్రమంగా పాటించడం లేదంటూ గురువారం హెచ్చరిక పంపిన బిగ్ బాస్ శుక్రవారానికి సభ్యుల మధ్య గొడవలు సృష్టించినట్లు అర్థమవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 22,2018 08:22PM