కణేకల్లు(అనంతపురం జిల్లా): మద్యం తాగే అలవాటున్న వెంకటేష్ అవివాహితుడు కాగా ఆదివారం ఈ ప్రాంతంలో ఉన్న ఓ ఐదేళ్ల చిన్నారిని తనతో పాటు నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పరిసరాల్లోని ముళ్ల కంపల వద్దకు తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ సమయంలో కొందరు యువకులు చూసి చిన్నారి తండ్రితో పాటు చుట్టుపక్కల వారికి చెప్పారు. అక్కడి ప్రజలంతా వెంకటేష్‌ను చుట్టు ముట్టడంతో వారిపై ఎదురు తిరిగేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహావేశానికి గురైన స్థానికులు వెంకటేష్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు ఘట నా స్థలానికి చేరుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు
Mon Jan 19, 2015 06:51 pm