న్యూఢిల్లీ: బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఐదున్నర నెలల కనిష్టానికి నేడు బంగారం ధరలు పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్ క్షీణించడం.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర నేడు బులియన్ మార్కెట్లో 250 రూపాయలు తగ్గి, రూ.30,800గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 620 రూపాయలు తగ్గి 40వేలకు కింద రూ.39,200గా నమోదైంది. వెండి కూడా పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ క్షీణించింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. దీంతో సెంటిమెంట్ బలహీనపడిందని బులియన్ ట్రేడర్లు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm