కడప: ప్రసిద్ధిగాంచిన కడప పెద్దదర్గాను గురువారం సాయంత్రం సినీనటులు అలీ సందర్శించారు. ఈయన మొహరం పండగ సందర్భంగా చిన్నమండెంకు వెళ్తు పెద్దదర్గాను సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పూల చాదర్లను ఉంచి ప్రార్థనలు చేశారు. దర్గా నిర్వాహకులు అమీర్ స్వాగతం పలికారు. దర్గా విశిష్టత గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. పెద్దదర్గా విశిష్టత గురించి అందరికీ తెలుసునన్నారు. కేవలం రాష్ట్రానికే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిందన్నారు. పెద్ద దర్గాను సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm