వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మేరీల్యాండ్‌లోని బాల్టీమోర్ ప్రాంతంలో ఓ మహిళ జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మహిళను పట్టుకునేందుకు యత్నించారు. కాగా పారిపోయే క్రమంలో ఆ మహిళ తనను కాల్చుకుని మృతి చెందింది. కాల్పుల్లో గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా మహిళ కాల్పులకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm