హైదరాబాద్ : కులాంతర వివాహం చేసుకున్నందుకు మామ చేతిలో కత్తి పోటుకు గురైన సందీప్‌పై పలువురు ఇలా స్పందించారు..
సందీప్ ఎటువంటి గొడవలకు దిగడు... తన చదువేదో చదువుకుంటూ కష్టపడుతూ మోతీనగర్‌లోని రాయుడు బిర్యానీ సెంటర్లో పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడు. కూకట్‌పల్లిలోని వివేకానంద కాలనీలో డిగ్రీ బీకాం కంప్యూటర్స్ సెకండీయర్ చదువుతున్నాడు. మంచి మనస్తత్వం కలవాడు. దాడి జరగడం అమానుషమైన చర్య. దళితులపై దాడులను నాయకులు తీవ్రంగా ఖండించాలి. దాడులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.
- వి.సునీల్‌కుమార్, సందీప్ స్నేహితుడు
పెళ్లి అయినప్పటి నుంచి తన మామ బెదిరించేవాడని సందీప్ కొద్దిరోజుల క్రితం చెప్పాడు. మాలకులం వాడివి.. నా కూతురిని ప్రేమిస్తావా.. అని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఒక్కోసారి బయటకు వెళ్లాలంటే కూడా భయపడుతుండేవాడు.
- పి.వినయ్, స్నేహితుడు
సందీప్ మాధవిని ప్రేమిస్తున్న విషయం నాకు చెప్పేవాడు. ఒక్కోసారి ఆమెతో కలిసి తిరగడానికి బైక్‌ను తీసుకెళ్లేవాడు. మాధవి కూడా మంచి స్వభావం కలిగిన వ్యక్తి. కానీ ఇంత దారుణం జరుగుతుందని అనుకోలేదు. మాధవి ప్రాణాపాయ స్థితిలో ఉందని ఊహించుకోలేక పోతున్నాం.
- ఈ.క్రాంతికుమార్, స్నేహితుడు
సందీప్, మాధవిలపై దాడి జరిగిన సంఘటనకు ముందు ప్రేమ్‌నగర్‌లోని వారి ఇంటి ముందు నుంచి బయలుదేరేటప్పుడు ఇంటి ఎదురుగా ఉన్న వారు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలో పుటేజీలు నమోదయ్యాయి. ఇద్దరు తండ్రిని కలుస్తున్నామన్న ఆనందంతో బైక్‌పై వెళ్లారు. అంతలోనే ఇంత దారుణం జరిగింది. మనోహరాచారి నమ్మించి గొంతుకోశాడు. అతడిని కఠినంగా శిక్షించాలి.
- కార్తీక్, స్నేహితుడు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 21,2018 11:44AM