హైదరాబాద్ : గత నెలలో ఇండియాలో విడుదలైన నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఈ నెల 24న మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. నోకియా ఆన్ లైన్ స్టోర్, ఫ్లిప్కార్ట్ వెబ్ సైట్లో దీనిని ప్రత్యేకంగా విక్రయించనున్నారు. బ్లాక్, వైట్, బ్లూ కలర్ వేరియెంట్లలో లభించే ఈ ఫోన్ ఫస్ట్ లుక్, ఫీచర్లు వెల్లడించినప్పటికీ ధర వివరాలని ప్రకటించలేదు.
నోకియా 5.1 ప్లస్ ప్రత్యేకతలు:
5.86 హెచ్డీ ప్లస్ డిస్ప్లే( 720-1520 స్క్రీన్ రిజల్యూషన్)
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
వెనక భాగంలో 13/5 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు
ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
పీ60 ఆక్టాకోర్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (400 జీబీ వరకు పెంచుకోవచ్చు)
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3060ఎంఏహెచ్ బ్యాటరీ
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 21,2018 01:52PM