హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే బయోపిక్ ాఎన్టీఆర్్ణ. నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషించడమే కాకుండా.. ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం... భారీ తారాగణాన్నే చిత్రబృందం ఎంచుకుంది. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రను బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ పోషిస్తుండగా.. చంద్రబాబు పాత్రను రానా పోషిస్తున్నారు. ప్రస్తుతం 'నంబర్ వన్ యారీ' సీజన్ 2 ప్రమోషన్స్‌లో ఉన్న రానా తన పాత్ర ఎంపికపై ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర సమాధానమిచ్చాడు. ''చంద్రబాబు గారి పాత్ర చేయడం చాలా కష్టం. అది ఛాలెంజింగ్ పాత్ర. అయితే క్రిష్ లాంటి స్నేహితుడి అండతో.. ఆ కష్టాన్ని అధిగమిస్తున్నాను'' అని తెలిపారు. స్నేహితుల వల్లే నటన, నిర్మాణ రంగాల్లో రాణించగలుగుతున్నానని ఈ సందర్భంగా రానా వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm