హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రస్తుతం అవతార్ 2, అవతార్ 3 చిత్రాల తెరకెక్కిస్తున్నాడు. అవి విజయవంతమైతేనే 4, 5 రూపొందిస్తానని జేమ్స్ కామెరూన్ గతంలో వెల్లడించాడు. అయితే, ఇప్పుడు నాలుగు సీక్వెల్స్ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. 2009-10 సంవత్సరంలో అవతార్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఒక చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయా అంటూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆ చిత్రానికి 2.78 బిలియన్ డాలర్ల వసూళ్లు లభించాయి. ఆ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితోనే అవతార్ 2 అవతార్ 3 పట్టాలెక్కాయి. అవతార్ ఇచ్చిన విజయంతో దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ కథలను సిద్ధం చేశాడు. ప్రస్తుతం అవతార్ 2, అవతార్ 3 చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి వరుసగా డిసెంబర్ 18, 2020.. డిసెంబర్ 17, 2021న వస్తాయి. ఇక అవతార్ 4, అవతార్ 5 చిత్రాల విడుదల తేదీలను కూడా కామెరూన్ ప్రకటించారు. డిసెంబర్ 20, 2024, డిసెంబర్ 19, 2025లో ఆ చిత్రాలు విడుదలవుతాయి. ఇంతకీ ఈ సీక్వెల్స్ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఒక బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.6539 కోట్లు.
Mon Jan 19, 2015 06:51 pm