అమెరికా: అమెరికాలో విమానంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హ్యూస్టన్ నుంచి ఆల్బుకర్క్ వెళ్తున్న విమానంలో తన ముందుసీటులో కూర్చున్న మహిళ నిద్రపోతుండగా ఆమె మీద అతడు చేయివేశాడు. ఏదో అనుకోకుండా తగిలిందని ఆమె పట్టించుకోలేదు. తర్వాత అతడి చేతులు తనను తడమడం ఆమె గమనించింది. వ్యవహారం శ్రుతిమించడంతో ఆమె కేకలు పెట్టింది. విమానం నేలకు దిగిన తర్వాత పోలీసు అధికారులు వచ్చి అలెగ్జాండర్ అనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు నిందితుడు అధ్యక్షుడు ట్రంప్ ఇదంతా ఓకే అన్నాడుగా? అని పోలీసులతో వాగ్వాదానికి దిగాడట. ఆడవాళ్లను ఎలా పట్టుకోవాలో ట్రంప్ అత్యుత్సాహంగా వివరిస్తున్న వీడియోటేపు అధ్యక్ష ఎన్నికలప్పుడు హల్చల్ సృష్టించింది. ఈ మధ్యకాలంలో ఇలా ట్రంప్‌ను ఉటంకించే రేపిస్టులు పెరిగిపోయారట.
Mon Jan 19, 2015 06:51 pm