సియాటిల్: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఏదో ఒకరోజు దివాళా తీయొచ్చని ఆ కంపెనీ సీఈఓ జెఫ్ బెజోస్ ఉద్యోగులకు వెల్లడించారు. కంపెనీ భవితవ్యంపై ఆ సంస్థ ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉద్యోగులతో నిర్వహించిన వేరు వేరు సమావేశాల్లో బెజోస్పై వారు అనేక ప్రశ్నలు సంధించారు. న్యూయార్క్‌లోని ఐలాండ్ సిటీ, వర్జీనియాలో కార్యాలయాలను నిర్మిస్తున్నామని, అలాగే కొత్తగా చేపట్టనున్న మల్టీ మిలియన్ ప్రాజెక్టులో భాగంగా 25 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయని ఆయన సమావేశాల్లో ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm