హైదరాబాద్ : 66ఏళ్ల మిస్ యూనివర్స్ చరిత్రలో తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ పోటీలో నిలిచింది. మిస్ స్పెయిన్‌గా నిలిచిన 26ఏళ్ల భామ ఏంజెలా పోన్స్ ఇతర ముద్దుగుమ్మలతో కలిసి పోటీపడుతోంది. 2012 నుంచి మిస్ యూనివర్స్‌లో ట్రాన్స్జెండర్లు పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో ఆమె ఈ అందాల పోటీలో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పలు రౌండ్లలో తన ప్రతిభను చూపించింది. బ్యాంకాక్‌లో డిసెంబరు 17న జరగబోయే ఫైనల్స్‌లో ఆమె ర్యాంప్ వాక్ చేసి మెరవనుంది. ట్రాన్స్జెండర్ల పట్ల ఉన్న విముఖతను తొలగించి, ఎల్జీబీటీ కమ్యూనిటీకి గౌరవం ఇవ్వాలని సందేశాన్ని ఇచ్చేందుకు తనకు ఇదొక మంచి అవకాశమని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. ట్రాన్స్‌జెండర్ అనే కారణంగా గతంలో పలుమార్లు ఫ్యాషన్ పోటీల్లో పాల్గొనలేకపోయినట్లు ఆమె తెలిపారు. మిస్ స్పెయిన్ కిరీటాన్ని గెలిచినప్పుడు ఎంతో ఆనందించానని పేర్కొన్నారు. మొత్తం 94 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు ఈ అందాల పోటీలో పాల్గొంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm