హైదరాబాద్ : అమీర్పేట నుంచి బాలానగర్ రోడ్డులో వైట్ ట్యాపింగ్ పనులు జరుగుతున్న కారణంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఆయా మార్గాల్లో 16 రోజులపాటు అంటే ఆదివారం (16వతేదీ) నుంచి డిసెంబర్ 31 వరకూ ఈ ట్రాఫిక్ ఆంక్షలుంటాయని తెలిపారు.
అమీర్పేట సత్యం థియేటర్ ప్రాంతం నుంచి ఫతేనగర్ వెళ్లే వాహనదారులు ఎస్ఆర్నగర్ టీ జంక్షన్ నుంచి కమ్యూనిటీ హాల్, అభిలాష్ టవర్స్, ఏపీ కార్స్, భోగా రెసిడెన్సీ, హోలీక్రాస్ల మీదుగా ఫతేనగర్ వైపునకు వెళ్లాలి.
ఫతేనగర్ నుంచి అమీర్పేట వైపునకు వాహనాలను అనుమతించరు. ఎస్ఆర్నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ వెళ్లేవైపుకు ఉన్న అన్ని మార్గాలను మూసివేసి ఉంచుతారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 16,2018 06:55AM