చెన్నై: రాహుల్ గాంధీ దేశ తదుపరి ప్రధాని అవుతారని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. ప్రధాని కాగల సత్తా, సామర్థ్యం ఆయనకు ఉన్నాయని అన్నారు. డీఎంకే స్టాల్వార్ట్, దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ, పాసిస్ట్ మోదీ ప్రభుత్వాన్ని రాహుల్ గద్దె దింపుతారని, ఈ లక్ష్య సాధన కోసం తాము 2019 ఎన్నికల్లో రాహుల్‌తో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఐక్య కూటమిగా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును తాను తమిళనాడు గడ్డ నుంచి ప్రతిపాదిస్తున్నానని స్టాలిన్ ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm