న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ చాలా పెద్దగా ఊహించుకుంటోందని, రసగుల్లా తరహాలో ఈసారి ఆ పార్టీకి జీరో సీట్లు ఖాయమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాజ్యసభ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ అన్నారు. పశ్చిమబెంగాల్లో 20 లోక్సభ సీట్లు గెలుచుకుంటామంటూ బీజేపీ క్లెయిమ్ చేయడంపై ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ చాలా పెద్దగా ఊహించుకుంటోందని, 20 సీట్లు కాదు కదా, ప్రస్తుతం వారికున్న 2 సీట్లైనా కాపాడుకోగలిగితే అదే గొప్పని అన్నారు. లేదంటే ఆ పార్టీ రసగుల్లా తరహాలో జీరో కాక తప్పదంటూ చురకలు వేశారు.
Mon Jan 19, 2015 06:51 pm