చెన్నై : సీనియర్ హీరో అరుణ్ పాండ్యన్ తన కూతురు కీర్తి పాడ్యన్ ను వెండితెరకి పరిచయం చేస్తున్నారు. 90వ దశకంలో తమిళంలో యాక్షన్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న ఆయన, అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. ఆయన కూతురు కీర్తి పాండ్యన్ తమిళంలో తొలి సినిమా చేస్తోంది. హరీశ్ రామ్ దర్శకత్వంలో 'దర్శన్' జోడీగా ఓ యాక్షన్ సినిమాలో ఆమె కనిపించనుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో అరుణ్ పాండ్యన్ కూడా కనిపిస్తాడని అంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm