హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టనున్న సభ్యుల ప్రమాణస్వీకారం రాజ్ భవన్లో మంగళవారం జరగనుంది. ఉదయం 11.30 గంటలకు నిర్వహించే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పెద్ద సంఖ్యలో నాయకులు తరలిరానున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు మోనప్ప జంక్షన్ నుంచి వీవీ సర్కిల్ వరకు రాజ్ భవన్ పరిసరాల్లో సాధారణ ప్రజలను అనుమతించరు. ఆ మార్గంలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm