న్యూఢిల్లీ : ఢిల్లీలో ఉదయం మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నరేల ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక చెప్పుల దుకాణంలో ఈ తెల్లవారు జామున మంటలు ఎగసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చినట్టు అధికారులు తెలుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm