హైదరాబాద్: ర్యాష్ డ్రైవింగ్‌తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు బైక్‌పై అత్యంత వేగంతో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతన్న వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇతడి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm