హైదరాబాద్ : ఏపీ రాజాకీయాలపై వరుసగా వీడియోలు వదులుతున్న నాగబాబు నేడు మరో వీడియో వదిలాడు. అందులో 'ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ వీడియో బ్యాంకాక్‌లో జరిగిన యదార్థ సంఘటన. బ్యాంకాక్ దేశంలో బాలానంద మహరాజు.. పటాయా సముద్ర తీరంలో తన శిష్యులకు చెప్పిన గొప్ప ప్రవచనాలు అంటూ' నాగబాబు ఈ సెటైరికల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో చిత్రీకరించిన తీరు గమనిస్తే.. ఏపీలోని అధికార పార్టీ, ప్రతి పక్ష పార్టీ నేతలను పరోక్షంగా విమర్శించినట్లు ఉంది. ఈ స్కిట్లో బాలా నందమహరాజ్ పాత్రలో ఓ పిల్లాడు, భక్తుల పాత్రలో జబర్దస్త్ యాక్టర్స్ రైజింగ్ రాజు, దొరబాబు నటించారు. భక్తులు బాలబాబాను ప్రశ్నలు వేసిన తీరు... అతడు సమాధానాలు ఇచ్చే తీరు గమనార్హం నెటిజన్లు నవ్విస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm