హైదరాబాద్ : వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని మలకపేట ఆర్చి సమీపంలో ప్రమాదశాత్తు 50 తాటి చెట్లు కాలాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. హన్మకొండ, కేటీపీపీ ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. పోలీస్ అధికారులు ఘటనాస్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm