హైదరాబాద్: యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రారంభమైంది. ఆయన హీరోగా రూపుదిద్దుకోబోతున్న సినిమా 'హీరో'. ఆనంద్ అన్నామలై దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మాళవికా మోహనన్ కథానాయిక. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. కొరటాల శివ ముఖ్య అతిథి హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మాళవిక పలు మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల వచ్చిన రజనీకాంత్ 'పేట'లో కీలక పాత్ర పోషించారు.
Mon Jan 19, 2015 06:51 pm