ఇస్లామాబాద్: పాకిస్థాన్ బ్యాట్స్మన్ ఆసిఫ్ అలీ(27) కూతురు నూర్ ఫాతిమా(2) క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచింది. స్టేజ్-4 క్యాన్సర్తో బాధపడుతున్న ఫాతిమాకు అమెరికాలో ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె మృతిచెందినట్లు పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ ఇస్లామాబాద్ యునైటెడ్ ట్విటర్లో పేర్కొంది. తన కూతురు క్యాన్సర్తో బాధపడుతోందని ఆమె త్వరగా కోలుకునేందుకు ఆ దేవుడిని ప్రార్థించాలని గత ఏప్రిల్లోనే ఆసీఫ్ ట్విటర్లో అభిమానులను కోరాడు.
Mon Jan 19, 2015 06:51 pm