హైదరాబాద్ : సినీనటుడు వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై వరుణ్ తేజ్ కారును మరో కారు ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఆయన క్షేమంగా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు షూటింగ్ నిమిత్తం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ నుజ్జునుజ్జయ్యాయి. వాహనం దెబ్బతినడంతో వరుణ్ తేజ్, ఇంకొందరు నటులు మరో వాహనంలో బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm